కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Update: 2020-02-29 10:27 GMT

కరీంనగర్ జిల్లాలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగింది. జియో నెట్ వర్కింగ్ పనుల్లో భాగంగా తీసిన గోతిలో ఇద్దరు కూలీలు ఇరుకున్నారు. మట్టి పెల్లలు మీద పడి ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హూజూరాబాద్ మండలం కండుగల గ్రామంలో జియో నెట్ వర్కింగ్ పనులు కొనసాగుతున్నాయి. అయితే అర్థరాత్రి తరువాత ఐదుగురు కూలీలు ఈ పనులు చేస్తుండగా.. ఇద్దరు కూలీలు జియో నెట్ వర్కింగ్ కోసం తీసిన గోతిలో దిగారు. వారి మీద మట్టి పెల్లలు పడడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. వెంటనే స్పందించిన ఇతర కూలీలు గ్రామస్తులకు సమాచారం అందించారు.. వారందరి ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి.. జేసీబీల సహాయంతో మట్టిపెల్లలను తొలగించి.. బటయకు తీశారు. అప్పటికే ఒక వ్యక్తి చనిపోగా.. మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

Similar News