అతితక్కువ ఖర్చుతో పౌష్టికాహారం లభించే చికెన్ర్‌పై కరోనా ప్రభావం లేదని... నిర్భయంగా చికెన్‌ను తినవచ్చని మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళాలో మంత్రులు పాల్గొన్నారు. కోళ్ళకు కరోనా వైరస్ వ్యాపించిందంటూ వదంతులు రావడంతో చికెన్ అమ్మకాలు పడిపోయాయన్నారు. చికెన్‌లో మంచి పోషక పదార్థాలు ఉన్నాయని... చికెన్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని మంత్రులు అన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని... ఇలాంటి పుకార్లను నమ్మవద్దనే ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.