తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన అమలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఆరుగురు విద్యార్ధులను అధికారులు వెనక్కు పంపించారు. బాధిత విద్యార్ధుల్లో ప్రభుత్వ కాలేజ్‌కు చెందిన వారు ఐదుగురు, నలంద కాలేజ్‌కు చెందిన ఓ విద్యార్ధి ఉన్నారు.