కరీంనగర్ కాకతీయ కెనాల్‌లో కారు ప్రమాదానికి గురై సత్యనారాయణరెడ్డి కుటుంబం మృతి కేసులో మరో కోణం వెలుగు చూసింది. కుటుంబంతో సహా సత్యనారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎరువుల దుకాణాంలో పలు డైరీలు స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. తన ఆస్తిని టీటీడీకి అప్పగించాలని డైరీలో రాసినట్లు గుర్తించారు. షాపులో కొన్ని వస్తువులు దొరికాయన్న సీపీ కమలాసన్‌రెడ్డి.. అయితే డైరీలో రాసినది సత్యనారాయణరెడ్డా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉందన్నారు. ఇందుకోసం హ్యాండ్‌రైటింగ్ ఎక్స్‌పర్ట్‌కు, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్‌కి పంపినట్లు తెలిపారు. విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.