తెలంగాణలో కరోనా లేదు.. ఆందోళన వద్దు : మంత్రి ఈటెల

Update: 2020-03-05 18:40 GMT

తెలంగాణలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడికి తప్ప మరెవ్వరికీ కరోనా వైరస్ లేదని ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఒక్కగానొక్క పేషేంట్ కు గాంధీలో చికిత్స అందిస్తున్నామని.. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. అతని కుటుంబసభ్యుల్లోనూ ఎవరికీ కరోనా లేదని వెల్లడించారు. అంతేకాదు మైండ్ స్పేస్ లో ఐటీ ఉద్యోగికి కరోనా వైరస్ లేదని.. పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని అన్నారు. అలాగే అపోలోలో శానిటేషన్ మహిళకు కూడా నెగెటివ్ వచ్చిందని.. మొత్తం 21 నమూనాలు నెగిటివ్ వచ్చాయని స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని సూచించారు ఈటెల.

Similar News