ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ చింతల్‌బస్తీలోని ఆర్యవైశ్య భవన్‌లో అనుమానాస్పద స్థితిలోచనిపోయారు. మారుతీరావు స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. ఆయన రాత్రి ఆర్యవైశ్యభవన్‌లో బస చేశారు. తెల్లవారే సరికే శవమై కనిపించారు. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. మారుతీరావు సూసైడ్‌పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మారుతీరావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అన్నది తేలాల్సి ఉంది. వారం క్రితమే మారుతీరావుకు చెందిన షెడ్‌లో ఒక అనుమానాస్పద మృతదేహం లభ్యమైంది. దీనిపై విచారణ జరుగుతోంది. అటు ప్రణయ్ మర్డర్ కేసులో ఎలాగూ శిక్ష తప్పదని మారుతీరావు కొన్ని రోజులుగా తీవ్ర మనస్థాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. వారం క్రితమే ఆస్తులను భార్యపేరిట వీలునామా చేయించినట్లు సమాచారం..
అటు ప్రణయ్‌ను మర్డర్ చేసిన కిరాయి హంతకులు అబ్దుల్ బారీ, సుభాష్ శర్మ నుంచి ఒత్తిడి తీవ్రమైనట్లు తెలుస్తోంది. శిక్ష తప్పదని తెలియడంతో నిందితులు భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. అటు ఆస్తుల విషయంలోనూ కొన్ని రోజులుగా సోదరుడితో మారుతీరావుకు వివాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మారుతీరావుకి కుమారులు లేరు. దీంతో ఆస్తినంతా తన కుమారుల పేరిట రాయాలని మారుతిరావు సోదరుడు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే కొన్ని రోజుల నుంచి మారుతీరావు హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారు..పని ఉన్నప్పుడే మిర్యాలగూడ వెళ్లివస్తున్నారు. కూతురు దూరమైందన్న ఆవేదన, అస్తి వివాదం, కిరాయి హంతకుల నుంచి ఒత్తిడి... ఈ పరిణామాలన్నింటితో మారుతీరావు విసిగిపోయిన మారుతీరావు.... ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు...
మారుతీరావు కుమార్తె అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడు ప్రణయ్. ఇది ఏ మాత్రం ఇష్టంలేని మారుతీ రావు కిరాయిహంతకులతో అల్లుడు ప్రణయ్‌ను చంపించాడు. ఆస్పటల్‌కు వెళ్లివస్తుండగా.. ప్రణయ్‌ను కత్తులతో నరికి చంపారు దుండగులు .అప్పట్లో ఈ పరువు హత్య పెనుసంచలనంగా మారింది. ఈ కేసులో మారుతీరావుపై పీడీ యాక్ట్ కింద కేసు పెట్టారు పోలీసులు. 6 నెలల క్రితమే బెయిల్‌పై విడుదలయ్యారు...
బెయిల్‌పై విడుదలైన తర్వాత అమృతను ఇంటికి రావాలని కోరారు మారుతీరావు. ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్షం చెబితే ఆస్తి తనపేరు మీద రాయిస్తానంటూ మధ్యవర్తులతో రాయబారం నడిపారు..అయితే ఇందుకు ఒప్పుకోని అమృత.. తనపై ఒత్తిడి తెస్తన్నారంటూ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మరోసారి మారుతీరావుని అరెస్ట్ చేశారు.