కరోనా ఎఫెక్ట్.. కఠిన చర్యలు చేపట్టిన తెలంగాణ సర్కార్

Update: 2020-03-18 10:32 GMT

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ నెల 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, ఫుడ్ కోర్టులు, మాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, మ్యూజియం, స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నింటిని మూసివేయాల్సిందిగా ఆదేశించింది. సభలకు సమావేశాలకు కూడా అనుమతి లేదని క్లారిటీ ఇచ్చింది. చివరికి పెళ్ళిళ్లపై కూడా ఆంక్షలు విధించింది. ఎవరికైనా వైరస్ సోకినట్లు అనుమానం ఉంటే స్వియ నిర్బంధం విధించుకోవాలని కూడా స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంటే..కొందరు వ్యాపారులు, విద్యాసంస్థలు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయటం లేలు. ఎగ్జామ్స్ టైం కావటంతో స్కూళ్లు, కాలేజీలు క్లాసులు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే థియేటర్లు, ఫుడ్ కోర్టులు, మాల్స్, జిమ్స్ కూడా తెరిచే ఉంటున్నాయి.

ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని వ్యాపారులు, విద్యాసంస్థలపే GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కొరడా ఝులిపించారు. మూసివేయకుండా తెరిచి ఉంచి పలు స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, ఫుడ్ కోర్టులు, మాల్స్‌, జిమ్‌లను సీజ్ చేశారు. మంగళవారం ఒక్కరోజే 66 సంస్థలను జప్తు చేశారు. గ్రేటర్ పరిధిలో GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కొనసాగుతాయని, ప్రభుత్వ ఆదేశాలు పాటించకుంటే సంస్థలను సీజ్ చేయాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు.

మరోవైపు కోచింగ్ సెంటర్స్ కేపిటల్ అమీర్ పేట్ పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. వేలాది మంది విద్యార్ధులు ఇక్కడి హాస్టల్స్ లో ఉంటున్నారు. అలాగే కోచింగ్ సెంటర్లలో కూడా వేలాది మంది కోచింగ్ తీసుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా అమీర్ పేటలోని కోచింగ్ సెంటర్స్ తో పాటు 850 హాస్టళ్లను మూసివేయాల్సింది జీహెచ్ఎంసీ ఆదేశించింది. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. విద్యార్ధులను వెంటనే వారి స్వస్థలాలకు పంపించాల్సిందిగా హస్టల్స్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా జీహెచ్ఎంసీ ఆదేశాలను బేఖాతరు చేస్తే చర్యలు తప్పవని అధికారలు హెచ్చరించారు.

Similar News