ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్లా జిల్లాలో కరోనా నివారణకు చర్యలు చేపట్టారు. ఒకేచోట జనం గుమికూడకుండా చూస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వాహనాదారులు ఒకేసారి లోనికి వచ్చేందుకు అనుమతి ఇవ్వడం లేదు. పత్రాలు సేకరించిన తర్వాత వారికి సమయాన్ని కేటాయిస్తూ.. ఒకేసారి జనం గుమికూడకుండా చూస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా రవాణా శాఖ అధికారి కొండల్ రావు చెప్పారు. చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే కార్యాలయంలోకి అనుమతిస్తున్నామని తెలిపారు.