కరోనా వ్యాప్తిపై వాట్సాప్ గ్రూప్‌లో అసత్య ప్రచారం.. మున్సిపల్ కౌన్సిలర్‌పై కేసు
కరోనా వైరస్‌పై అసత్య ప్రచారం చేసినందుకు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌పై సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. సిరసిల్లలోని 38వ వార్డులో మున్సిపల్ కౌన్సిల్ అనే గ్రూపులో ఓ వ్యక్తి పట్టణంలో ఇద్దరికి కరోనా వైరస్ సోకిందని పోస్ట్ పెట్టాడు. అదికాస్త వైరల్‌గా మారి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు సంబంధిత గ్రూప్ అడ్మిన్ మున్సిపల్ కౌన్సిలర్ గూడూరి భాస్కర్‌పై నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆక్ట్ 2009 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వెంకట నర్సయ్య తెలిపారు. వైరస్ ఉన్నట్లు దృవీకరించే అధికారం కేవలం సంబంధిత అధికారులకే ఉందని.. తప్పుడు ప్రచారం చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు.