యూఏఈలో తొలి కరోనా మరణాలు.. ఇద్దరు మృతి చెందినట్లు ప్రకటన

Update: 2020-03-21 13:46 GMT

కరోనా వైరస్ కోరలు చాస్తోంది.. యూఏఈలో ఇన్నాళ్లు వ్యాప్తి వరకు పరిమితమైన కరోనా కేసుల్లో తొలిసారిగా మృత్యుఘంటలు మోగిస్తోంది. కరోనా వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు చనిపోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ అధికారులు వెల్లడించారు. యూరప్ నుంచి వచ్చిన 78 ఏళ్ల అరబ్ వ్యక్తితో పాటు, యూఏఈలో ఉంటున్న 58 ఏళ్ల ఆసియా వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మృతి చెందినట్లు ప్రకటించారు. యూరప్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది.

అయితే..చికిత్స తీసుకుంటున్న సమయంలో హార్ట్ అటాక్ రావటంతో అతను మృతి చెందినట్లు తెలిపారు. ఇక యూఏఈలో ఉంటున్న ఆసియా వ్యక్తి కరోనాతో కిడ్నీలు ఫెయిల్ అవటంతో మృతి చెందినట్లు వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన ఆ ఇద్దరి కుటుంబాలకు మినిస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది. కరోనా బారిన పడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించింది.

Similar News