ప్రజలంతా ఇంటికి పరిమితం కావాలి : ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి

Update: 2020-03-21 16:35 GMT

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న కరోనా నివారణ చర్యల్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్‌, GHMC అధికారులు పరిశీలించారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాలతోపాటు బస్సుల్లో సోడియం హైడ్రో క్లోరైడ్‌ ద్రావణాన్ని.. మున్సిపల్ సిబ్బంది స్ప్రే చేశారు. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో కెమికల్ స్ప్రే చేయిస్తున్నామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు.. ప్రజలంతా జనతా కర్ఫ్యూకు సహకరించాలన్నారు. ప్రజలంతా ఇంటికి పరిమితం కావాలని సుధీర్‌ రెడ్డి సూచించారు.

Similar News