కరోనా వైరస్ : సహాయ కార్యక్రమాల కోసం హీరో నితిన్ విరాళం

Update: 2020-03-23 13:15 GMT

కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి ప్రభుత్వాల తోపాటు సెలబ్రిటీలు కూడా నడుం బిగించారు. సహాయ కార్యక్రమాల కోసం హీరో నితిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 10 లక్షలు.. మొత్తం 20 లక్షల విరాళాన్ని తన వంతు బాధ్యతగా అందజేయాలని నిర్ణయించారు. అంతేకాదు కరోనా కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని ప్రశంశించారు.. ఈనెల 31 వరకూ లాక్ డౌన్ పాటించి ప్రజలందరూ ప్రభుత్వాలకు సహకరించాలని ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు నితిన్.

Similar News