ప్రాణాలు ముఖ్యమా? వారం రోజుల పని ముఖ్యమా? : మంత్రి ఈటల

Update: 2020-03-24 08:47 GMT

మార్చి ‌31 వరకు ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచించారు ఆరోగ్యశాఖ మంత్రిశాఖ మంత్రి ఈటల. హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు కూడా బయట తిరిగితే ఎలా అని ప్రశ్నించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. విదేశాల నుంచి ఎవరైనా వస్తే స్థానికులు సమాచారం ఇవ్వాలని సూచించారు. జనరల్ చెకప్‌ల కోసం ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెళ్లొద్దని చెప్పారు.. గాంధీ, కింగ్ కోఠి, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 33కు పెరిగాయని.. సోమవారం ఒక్కరోజే ఆరుగురు వైరస్ బారినపడ్డట్టు మంత్రి ఈటెల తెలిపారు. రాష్ట్రంలో మరో 97 అనుమానిత కేసులు ఉన్నట్లు చెప్పారు.

ప్రాణాలు ముఖ్యమా?వారం రోజుల పనిముఖ్యమా?అని ప్రశ్నించారు మంత్రి ఈటల. పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉంటే కొంపలు మునిగిపోతున్నట్టుగా కొందరు బయటకు వస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి ఫంక్షన్స్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. రూల్స్ కఠినంగా అమలు చేస్తామని అన్నారు. ప్రజలు కనీస బాధ్యతగా 14 రోజుల పాటు ఓపిగ్గా ఇంట్లోనే ఉండాలన్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్ సిటీలోకి ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదని చెప్పారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో యువత హద్దులు మీరి ప్రవర్తించి.. ఇబ్బందులు తేవొద్దని తెలంగాణ హోం మంత్రి మహమ్మూద్ అలీ అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలకు తలెత్తిన ఇబ్బందులు.. తదుపరి తీసుకోవాలసిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. వలస కూలీలు ఇంటికి వెళ్లలేక, తిండి దొరక్క ఇబ్బంది పడుతున్న వారి కోసం.. 5 రూపాయల భోజన పథకం స్టాళ్లను తెరిచే ఆలోచన ఉందని మహమూద్ అలీ స్పష్టంచేశారు. ఇప్పటికే ఆంక్షలను కఠినం చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఇంకాస్త సీరియస్‌గా వ్యవహరించనుంది.. ఎలాంటి కారణం లేకుండా రాత్రి ఏడు తరువాత జనం రోడ్లపై కనిపిస్తే అరెస్ట్‌ చేసేందుకు కూడా వెనుకాడడం లేదు.

Similar News