లాక్‌డౌన్‌తో హైద్రాబాద్‌లోని రైతు బజార్లకు.. జనాలు బారులు తీరారు. నిత్యావసర సరకుల కోసం వచ్చిన జనాలతో రైతుబజార్లు కిటకిటలాడాయి. ఐతే ఇదే అదునుగా కొందరు వ్యాపారులు ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచేశారు. దీంతో జనం.. వ్యాపారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యవసరాలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టకున్నా.. ధరలు పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎర్రగడ్డ రైతు బజార్ లో అడ్డుగోలుగా ధరలు పెంచి కూరగాయలు అమ్ముతుండడంతో జనం తిరగబడ్డారు. ఓ షాపు లో కూరగాయలను ఎత్తుకెళ్లారు.