మూడు నెలల పింఛను ముందుగా చెల్లింపు

Update: 2020-03-28 09:11 GMT

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అర్హులందరికీ మూడు నెలల పింఛను ముందుగానే ఇవ్వాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. వితంతువులు, సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులకు మూడు నెలల పింఛను మొత్తాన్ని ఏప్రిల్‌ మొదటి వారంలో ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఎన్‌ఎస్‌ఏపీ కింద 60 నుంచి 79 ఏళ్ల సీనియర్‌ సిటిజన్లకు నెలకు రూ.200 చొప్పున, 80 ఆపైన వయస్సు వారికి రూ.500 చొప్పున కేంద్రం అందజేస్తోంది. 79 ఏళ్ల వరకు ఉన్న దివ్యాంగులకైతే రూ.300, 80 ఆపై వ యస్సు వారికి రూ.500, వితంతువులు 40 నుంచి 79 ఏళ్ల వారికి రూ.300, 80 ఆపై వయస్సు వారికి రూ.500 చొప్పున అందజేస్తోంది. దీంతో పాటు కరోనా ప్యాకేజీ కింద అదనంగా రెండు విడతల్లో కలిపి రూ.1000 అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Similar News