తెలంగాణలో చనిపోయిన వ్యక్తికి కరోనా పాజిటివ్

Update: 2020-03-28 14:43 GMT

తెలంగాణాలో చనిపోయిన వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. నాంపల్లిలో వృద్ధుడు(74) మృతి చెందాడు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే అతని రక్త నమూనాలను పరీక్షించగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

చనిపోయిన వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌లో ఉంచినట్టు మంత్రి వెల్లడించారు. అలాగే శనివారం కొత్తగా ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని మంత్రి అన్నారు. దీంతో తెలంగాణలో మొత్తం 65 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని స్పష్టం చేశారు.

Similar News