ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చి తొలి ట్వీట్ ద్వారా సాయం ప్రకటించిన శర్వానంద్
కరోనా వైరస్ కట్టడికోసం యువహీరో శర్వానంద్ ముందుకొచ్చారు.. కరోనా సహాయం ప్రకటించడానికి ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి ట్వీట్ ద్వారా శర్వానంద్ కరోనా సాయాన్ని ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నాడు. దినసరి కార్మికులకి అండగా నిలిచేందుకు రూ.15 లక్షల విరాళం ఇస్తున్నట్లు తెలిపాడు. అందరం కలిసి కరోనాని ఎదుర్కొందామని, ప్రభుత్వం చెబుతున్న సలహాలు, సూచనలు తప్పక పాటిద్దామని పేర్కొన్నారు శర్వా.