తెలంగాణలో లాక్ డౌన్ మంచి ఫలితాలు ఇస్తోంది : సీఎం కేసీఆర్

Update: 2020-03-30 12:58 GMT

తెలంగాణలో లాక్ డౌన్ మంచి ఫలితాలు ఇస్తోంది. కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాకపోతే ఏప్రిల్ 7వ తేదీ తరువాత కరోనా సమస్య ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ట్రావెల్ హిస్టరీ ఉన్నవారిలో తప్ప ఇక్కడివాళ్లకు వైరస్ నిర్ధారణ కాలేదని చెప్పారు. ఇప్పటివరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 70 కి చేరిందని వీరిలో 11 మంది కోలుకుంటున్నారని అన్నారు. వారికి పరీక్షలు జరిపి డిశ్చార్జ్ చేయనున్నారు.

మిగిలిన వారికి సైతం పరీక్షలు నిర్వహించి తగ్గితే క్రమంగా పంపిస్తామని అన్నారు. ఇప్పటికే కోలుకున్న బాధితులను ఆసుపత్రులనుంచి పంపించే ముందు పక్కాగా పరీక్షలు చేసి పంపిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఖ్వారంటైన్ లో ఉన్న 25 వేల 935 మంది నిఘాలో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కు అందరూ సహకరిస్తున్నారని ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కోరారు. కర్ఫ్యూ , లాక్ డౌన్ ఉన్నంతకాలం స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. కాగా వైరస్ కారణంగా తెలంగాణలో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Full View

Similar News