తెలంగాణ నుంచి ఢిల్లీకి 800 మంది

Update: 2020-03-31 15:56 GMT

తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీ కేసుల వ్యవహారం తలనొప్పిగా మారింది. రాష్ట్రంనుంచి పెద్దసంఖ్యలో ప్రజలు నిజముద్దిని వెళ్లిరావడం, వీరిలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు కనిపించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రార్థనలకు వెళ్లిన వారి వివరాలు సేకరిస్తోంది. మొత్తం తెలంగాణ నుంచి 800 వందల మంది దాకా ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇందులో హైదరాబాద్ నుంచి 186 మంది, మెదక్ 26 , నల్గొండ 21 , ఖమ్మం 15, ఆదిలాబాద్ 10 , రంగారెడ్డి 15, కరీంనగర్ 17, మహబూబ్ నగర్ 25, భైంసా 11 మందిని ప్రస్తుతానికి గుర్తించారు. మత ప్రార్థనలకు ఎవరైతే వెళ్లారో తప్పకుండా సమాచారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది.

Full View

Similar News