వలస కూలీలకు అండగా నిలిచిన టీవీ5, గూడూరు శివరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్

Update: 2020-03-31 15:41 GMT

కరోనా విపత్తు ప్రజల జీవితాలను కుంగదీస్తోంది. వలస కూలీలు ఆకలికి అలమటించే పరిస్థితి, ఏరోజుకారోజు పనిచేసుకొని పొట్టనింపుకునే వర్గాల ప్రజలు రోజు గడవక అల్లాడిపోతున్నారు. వారి కష్టాన్ని గమనించిన tv5 సామాజిక బాధ్యతగా నిరుపేద కూలీలను ఆదుకునేందుకు సంకల్పించింది.హైదరాబాద్ లో గూడూరు శివరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ భాగస్వామ్యంతో వలసకూలీలకు బియ్యం, కందిపప్పు పంపిణి కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా మాదాపూర్, చందానాయక్ తండాలో పేదలకు ఐదు కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు పంపిణి చేసింది. కార్యక్రమంలో tv5 ఎడిటర్ విజయనారాయణ, ట్రస్ట్ నిర్వాహకులు గూడూరు పునీత్, కోటేశ్వరావు, వాసు, మరియు మాదాపూర్ ఎస్సై వీరప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇకముందు కూడా కొనసాగిస్తామని ట్రస్ట్ చైర్మన్ గూడూరు శివరామకృష్ణ అన్నారు.

Full View

Similar News