ఏపీలో కరోనా విలయతాండవం చేస్తుంది. కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. తాజా కేసులతో కలిపి మొత్తం 87 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయని బులిటెన్ ద్వారా తెలిపింది. జిల్లాలవారీగా కొత్త కేసుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది.
కడపలో ఎక్కువగా 15 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 13, చిత్తూరు జిల్లాలో 5, ప్రకాశంలో మరో నాలుగు కేసులు పాజిటివ్ తేలాయి. ఒక్కసారిగా ఇన్ని నమోదు కావడం సంచలనం రేపుతోంది.
రాష్ట్రంలో నిన్న (31.3.2020) సాయంత్రం 9 గంటల తర్వాత నుంచి ఈ రోజు (01.04.2020) ఉదయం 9:00 వరకు 43 కొత్త కొవిడ్-19 పోజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వీటితో కలిపి మొత్తం 87 పాజిటివ్ కేసులు రాష్ట్రము లో నమోదయ్యాయి.@AndhraPradeshCM @MoHFW_INDIA #APFightsCoronaVirus #COVID #covidupdate pic.twitter.com/NgP9hMi8FN
— ArogyaAndhra (@ArogyaAndhra) April 1, 2020