YS Jagan : అమరావతిపై ఆగని వైసీపీ తప్పుడు ప్రచారం.. ఇంకెన్నాళ్లు..!

Update: 2026-01-27 16:00 GMT

అమరావతిపై ఇప్పటికీ వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉంది. జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లు అమరావతి రైతులను వేధించారు. నానా ఇబ్బందులు పెట్టారు. ఏపీకి రాజధాని లేకుండా చేయాలని చూశారు. రైతుల కన్నీళ్ల ఉసురు తగిలి వైసీపీ కొట్టుకుపోయింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం అయ్యారు. అయినా సరే వాళ్ల దరాణాలు ఆగట్లేదు. ఇప్పటికీ తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు వైసీపీ నేతలు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కోసం బిల్లు ప్రవేశ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ అభివృద్ధి జరిగినా లేదంటే అమరావతి పూర్తి అయినా సరే వైసీపీని ప్రజలు పట్టించుకోరు అని ఆ పార్టీ నేతలకు అర్థం అయింది. అందుకే రాజధాని అంతా ఉత్తదే అని.. ఎలాంటి పనులు అక్కడ జరగట్లేదని.. నదీగర్భంలో రాజధాని ఎవరైనా కడుతారా అంటూ వైసీపీ అధినేత జగన్ అనడం.. దాన్ని ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం చూస్తున్నాం కదా.

వాళ్ల తప్పుడు ప్రచారాలకు ఇప్పుడు పార్లమెంట్ లో చట్టబద్ధత బిల్లుతోనే సమాధానం చెప్పాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టు సీఎం చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నారు. నోటితో కాకుండా బిల్లుతోనే సమాధానం చెబితే వైసీపీకి దిమ్మతిరిగిపోద్ది అనేది సీఎం చంద్రబాబు ప్లాన్.

Tags:    

Similar News