మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు, సినీహీరో నారా రోహిత్ కరోనా కట్టడికి భారీ సాయం అందించారు. నారా రోహిత్ మొత్తం రూ. 30 లక్షల విరాళం ప్రకటించారు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షల చొప్పున విరాళం అందజేయనున్నట్టు రోహిత్ తెలిపారు.
మరో రూ. 10 లక్షలను ప్రధాన మంత్రి సహాయ నిధికి ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ సందర్బంగా కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని.. అందరూ తమవంతు సాహసహకారాలు అందించాలని రోహిత్ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ను అందరూ తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. మనం పాటించే స్వీయ నియంత్రణే మనకు శ్రీరామరక్ష అని అన్నారు.