భారత్ లో కరోనావైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. వైరస్ ఇప్పటివరకూ 2,069 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. వైరస్ బారిన పడ్డ వారిలో 155 మంది కోలుకొని కొందరు డిశ్చార్జ్ అయినట్టు పేర్కొంది. ఇక ఈ వైరస్ భారిన పడి భారత్ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 53 మంది ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేసింది. ప్రస్తుతం బాధితుల సంఖ్య ఇప్పుడు 1,860గా ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. అత్యధికంగా మహారాష్ట్రలో 335 కరోనా కేసులు నమోదు అయ్యాయని.. కేరళలో 265 కేసుల నమోదుతో రెండో స్థానంలో ఉందని తెలిపింది.