ఉన్నవాటితో అడ్జస్ట్ అవ్వండి. బయటకు వెళ్తే వైరస్ అటాక్ చేస్తుందని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. ప్రభుత్వం మాటని పెడ చెవిన పెట్టకండి అని నటి మీనా ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. విదేశాల్లో వేల మంది చనిపోతున్నారనే వార్త కలచి వేస్తోంది. లాక్‌డౌని అతిక్రమించి ప్రజలు రోడ్డుమీదకు వస్తున్నారనే వార్తలు చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆమె అన్నారు. ఇంట్లో కూర్చునే దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడే అద్భుత అవకాశం మళ్లీ రాదని ఆమె ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు. గవర్నమెంట్ మాట వినకుండా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాలు ఇప్పుడు ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాయో తెలుసుకదా. వందల్లో జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అని అనకండి.. పిల్లలతో ఆడుకోండి.. హోం వర్క్ చేయించండి.. వంటలో సాయం చేయండి.. నేను చెప్పేది సరదాగా తీసుకోకండి.. మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. దయచేసి ఇంటి పట్టునే ఉండండి అంటూ మీనా వీడియోలో పేర్కొన్నారు.
Actress #Meena urges everyone to be responsible and #StayHomeStaySafe #IndiaFightsCorona pic.twitter.com/A8m660URah
— BARaju (@baraju_SuperHit) April 5, 2020