గుంటూరులో తొలి కరోనా మరణం.. మృతి చెందిన తర్వాత పాజిటివ్‌గా నిర్థారణ

Update: 2020-04-09 19:16 GMT

కరోనా మహమ్మారి ఏపీలో మరొకరని బలి తీసుకుంది. గుంటూరు జిల్లాలో తొలి కరోనా మరణం నమోదయింది. జిల్లాలోని నరసరావుపేట వరవకట్టకు చెందిన ఓ వ్యక్తి టీబీ వ్యాధి చికిత్స కోసం 10 రోజుల క్రితం ఐడీహెచ్‌ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతి చెందాడు. అయితే బాధితుడు మృతి చెందిన అనంతరం పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు నరసరావుపేట ఆర్డీవో వెల్లడించారు.

దీంతో అప్రమత్తమైన ఏపీ వైద్యఆరోగ్యశాఖ అధికారులు మృతుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్ సెంటర్లకు తరలించి పరీక్షలు చేస్తున్నారు. అంతేకాదు మృతడి నివసించే వరవకట్టతో పాటు వృతిరీత్యా అతడు తిరిగిన రామిరెడ్డి పేట, పల్నాడు రోడ్ ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 348 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా గుంటూరు జిల్లాలోనే 49 కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా బారి నుంచి 9 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

Similar News