శనివారం తెలంగాణ కేబినెట్‌ ప్రత్యేక భేటీ

Update: 2020-04-10 16:52 GMT

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ ప్రత్యేక సమావేశం శనివారం జరగనుంది. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 3గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా కేసులు, లాక్ డౌన్, రాష్ట్రంలో అకాల వడగండ్ల వాన, రైతుల సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా భేటీకానుంది.

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను పొడిగించే అంశం, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, భవిష్యత్‌ వ్యూహ రూపకల్పన, రాష్ట్రంలోని పేదలు, ఇతర రాష్ర్టల నుంచి వలస వచ్చిన కార్మికులకు అందుతున్న సాయం, లాక్ డౌన్ కారణంగా పలురంగాల వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా చర్చకు వచ్చే అవకాశం వుంది.

Similar News