తెలంగాణ టీడీపీ నేత కందిమళ్ల కన్నుమూత

Update: 2020-04-10 12:03 GMT

తెలంగాణకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కందిమళ్ల రఘునాథరావు గురువారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కందిమళ్ల హైదరాబాద్, రాజీవ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన స్వస్థలమైన నిజామాబాద్ జిల్లా బోధన్‌‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని అక్కడికి తరలించారు. రఘునాథరావు మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు..

ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. అందులో.. 'తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కందిమళ్ళ రఘునాథ్ రావ్ గారి మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో చురుకుగా ప్రజాసేవా కార్యక్రమాలలోను, ప్రజాసమస్యల పరిష్కారంలోనూ కృషి చేసే రఘునాథ్ గారి మృతి, పార్టీకి తీరని లోటు. రఘునాథ్ గారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని... ఈ విషాదం నుండి త్వరగా కోలుకునే మనో ధైర్యాన్ని వారి కుటుంబసభ్యులకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అంటూ పేర్కొన్నారు.. కాగా తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా సంతాపం తెలిపారు.

Similar News