గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 941 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఈ మేరకు తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 12,380కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. గత 24 గంటల్లో 37 మంది కరోనాతో మృతి చెందారని ఆయన తెలిపారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 414కు చేరుకుందని.. గడిచిన 24 గంటల్లో 183 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు.
అటు దేశవ్యాప్తంగా 325 జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించినట్లు కేంద్రం తెలిపింది.