చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఇతనిపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. చింతల్‌వార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య శనివారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు నాయకుడు మృతిచెందాడు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు 315 రైఫిల్, గ్రనైడ్లు, టిఫిన్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు.