కరోనా భయంతోనే కొంత కాలం బ్రతకాల్సిన అవసరం రావచ్చు: డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి

Update: 2020-04-19 14:19 GMT

ప్రపంచం మొత్తం ఓ వైపు కరోనాతో పోరాడుతూ.. మరోవైపు అన్ని దేశాలు ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ కనిపెట్టేపనిలో పడ్డాయి. అయితే ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి ప్రొఫెసర్ డేవిడ్ నబేరో సంచలన వ్యాఖలు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టగలం అని ఖచ్చితంగా చెప్పలేమని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ భయంకరమైన పరిస్థితులకు భయపడుతూనే బ్రతకాల్సి ఉండే అవకాశం కూడా లేకపోలేదని.. కరోనా భయంతోనే జీవనం సాగించాల్సి వచ్చినా.. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

'కొన్ని రకాల రకాల వ్యాధులకు వ్యాక్సిన్ తయారుచేయటం చాలా కష్టం. కనుక.. కరోనా వైరస్ భయంతో ఎలా బ్రతకాలనే దాని గురించి ఆలోచించాలి. కరోనా లక్షణాలున్న వారిని ఐసోలేషన్‌లోనే ఉంచాలి. వేరే మార్గం లేదు. వృద్ధులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కరోనా ఆస్పత్రుల సంఖ్య పెంచాలి. కొంత కాలం పాటు మనం ఇటువంటి పరిస్థితుల్లోనే జీవించాల్సి రావచ్చు' అని ఆయన అభిప్రాయపడ్డారు.

అంటువ్యాధుల నిపుణుడిగా గుర్తింపు పొందిన డేవిడ్ చేసిన ఈ వ్యాఖలు సంచలనంగా మారాయి.

Similar News