దక్షిణ కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లు రెండు రోజుల పాటు నిలిపివేత

Update: 2020-04-21 20:18 GMT

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేఫథ్యంలో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడానికి దక్షిణ కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్టు కిట్లు కేవలం 5.4 కచ్చితత్వాన్ని మాత్రమే చూపిస్తున్నాయి. పాజిటివ్ పేషెంట్లకు కూడా నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయంటూ రాజస్థాన్ ఆరోగ్య మంత్రి రఘుశర్మ ఆరోపించారు. పది నిమిషాల్లోనే ఫలితాలు తెలుస్తాయంటూ.. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక ఛార్టెడ్ విమానాల ద్వారా తెప్పించిన ఈ ర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారా ఫలితం లేదని తేలిపోయింది. దీంతో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా కరోనా వైరస్ ఫలితాలను నిలిపివేసింది రాజస్థాన్ ప్రభుత్వం. రాజస్థాన్ ప్రభుత్వం వీటి వాడకాన్ని నిలిపివేసిన నేపథ్యంలో ఐసీఎంఆర్ సంచలన నిర్ణయం తీసుకుంది.

కొవిడ్-19 పరీక్షల కోసం రాపిడ్ టెస్ట్ కిట్లను రెండు రోజుల పాటు వినియోగించరాదంటూ భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆదేశించింది. ఈ కిట్ల ద్వారా తప్పుడు ఫలితాలు వస్తున్నాయంటూ ఫిర్యాదు వచ్చినందున ప్రస్తుతానికి రాష్ట్రాలు వాటిని ఉపయోగించవద్దని సూచించింది.

Similar News