ఏపీలో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతుంది. గత 24 గంటల్లోనే 80 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 893కి చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం తాజాగా నమోదైయాన కేసుల్లో కర్నూల్‌లో 31, గుంటూరులో 18, చిత్తూరు 14 నమోదయ్యాయి. అటు అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాలో చెరో 6 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, కృష్ణ జిల్లాలో 2 కేసులు చొప్పున నమోదుకాగా.. విశాఖలో ఒక కేసు నమోదైంది.
అయితే.. ఒక్క రోజే ఇన్ని కేసులు నమోదవ్వటంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.