తెలంగాణలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 943కు చేరింది. రాష్ట్రంలో కరోనా బారిన పడి బుధవారం ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కరోనా తో మృతి చెందిన వారి సంఖ్య 24 కు చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం 725 యాక్టివ్ కేసులు ఉన్నాయి.