తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

Update: 2020-04-24 23:05 GMT

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 983కు చేరింది. వీటిలో 663 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకొని శుక్రవారం 29 మంది డిశ్చార్జీ అయ్యారు. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

Similar News