మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్‌లో ఇద్దరు సాధువులను హత్య చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి సీఎం యోగిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ "ఘోరమైన" నేరానికి పాల్పడినవారికి కఠినంగా శిక్ష విధించాలని థాకరే అన్నట్టు తెలుస్తోంది.
ఈ ఘటనకు మతపరమైన రంగు పులమాద్దొని అన్నారు. కాగా మంగళవారం యూపీలో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు.. దీంతో ఇది పెద్ద సంచలంగా మారింది. బులంద్‌షహర్ జిల్లాలోని శివాలయానికి చెందిన ఇద్దరు పగౌనా గ్రామానికి చెందిన జగదీష్ (55), షెర్సింగ్ (45) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే.