గత కొన్ని రోజులుగా కరోనావైరస్ కేసులు మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 8,590 కు చేరుకుంది. 24 గంటల్లో మహారాష్ట్రలో 522 కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ సంక్రమణ వేగంగా వ్యాప్తి చెందుతున్న మహారాష్ట్రలోని పూణే నగరంలో మే 3 వరకు కంటైనేషన్ జోన్‌గా నోటిఫై చేశారు. 8,500 కేసులతో, భారతదేశంలో అత్యధికంగా కోవిడ్ -19 కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది, ఇక ఇక్కడ 369 మరణాలు నమోదయ్యాయి.
అలాగే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గుజరాత్‌లో మంగళవారం నాటికి మొత్తం 3,548 కరోనావైరస్ కేసులు ఉన్నాయి. అలాగే మరణించిన వారి సంఖ్య 162 కి చేరుకుంది. సోమవారం, అంటువ్యాధుల కేసులు కేవలం 3,000 కు పైగా ఉండగా, మరణాల సంఖ్య 151 గా ఉంది. ఇందులో అహ్మదాబాద్‌లో 100 మరణాలు ఉన్నాయి. అలాగే ఢిల్లీలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 3,000 దాటింది. ఇప్పుడు, మొత్తం 3,108 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 54 గా ఉంది. 877 మంది రోగులు కోలుకోగా, 2,177 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం పేర్కొంది.