తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మాట్లాడిన కేసీఆర్ లాక్‌డౌన్ ను పొడిగింపును ప్రకటించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందులో ప్రజల సహకారం కావాలని అన్నారు, కొద్ది రోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని పేర్కొన్నారు.
కాగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలకాంశాలపై చర్చించారు. మీడియా సమాసవేశంలో కేసీఆర్ తోపాటు మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ లు పాల్గొన్నారు. ఇక రాష్టంలో 1,096 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో 628 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం మరో 43 మంది కూడా డిశ్చార్జ్ కావడం విశేషం.