విశాఖలోని గోపాలపట్నంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీగా గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా 3 కిలోమీటర్ల మేర గ్యాస్ వ్యాపించింది. దీంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే ఎనిమిది మంది మృతి చెందారు. సుమారు 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో విశాఖ ఘటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా నేతలతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని విశాఖ నేతలు చంద్రబాబుకి వివరించారు. ప్రజలకు అండగా నిలవాలని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. తక్షణమే ప్రజలకు సహాయ చర్యలు అందించాలని చంద్రబాబు తమ పార్టీ నేతలకు సూచించారు.