అమెరికా నుంచి శంషాబాద్‌కి ప్రత్యేక విమానం చేరుకుంది. ముంబై మీదుగా శంషాబాద్‌కి వచ్చిన ఈ ఫ్లైట్‌లో 118 మంది ప్రయాణికులు ఉన్నారు. వైద్య పరీక్షల తర్వాత వీరందరినీ పెయిడ్ క్వారంటైన్‌కి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఎయిర్‌పోర్టు నుంచి వీరిని హోటల్స్‌కి తరలించేందుకు ఆర్టీసీ 56 బస్సులను సిద్ధంగా ఉంచింది. విదేశాల నుంచి 2 వేల 900 మంది వరకూ రానున్న నేపథ్యంలో.. వీరందరికీ హోటల్స్‌లో బస కల్పిస్తారు. 15 వేలు, 30 వేలు ప్యాకేజీల్ని ఎంచుకునే వీలు కల్పిచారు. ఇప్పటికే కువైట్ నుంచి హైదరాబాద్ 163 మంది చేరుకోగా, సాయంత్రం అబుదాబీ నుంచి మరో స్పెషల్ ఫ్లైట్ రానుంది.