రోడ్లపై వాహనానికి ఏ చిన్న సమస్య వచ్చినా చూసే దిక్కు లేకుండా పోతోంది. రోడ్లపై వాహనాలు ఆగిపోతే ఇక అంతే సంగతులు. ప్రాబ్లెమ్ సాల్వ్ చేయడానికి మెకానిక్‌లు వెంటనే వచ్చే పరిస్థితి లేదు. లాక్‌డౌన్ కారణంగా మెకానిక్‌లు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను కొద్దిగా సడలించడంతో వాహనాలు రోడ్ల పైకి వస్తున్నారు. ఐతే ప్రయాణం మధ్యలో వెహికిల్‌కు ఇబ్బంది వస్తే ఎలా అని ప్రయాణికులు టెన్షన్ పడు తున్నారు. సర్వీస్ సెంటర్లు, మెకానిక్‌లకు పర్మిషన్ ఇస్తే కాస్త వెసులుబాటుగా ఉంటుందని చెబుతున్నారు.