ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్న ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల ప్రజలు
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో ప్రజలు ఇప్పుడిప్పుడే తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇంట్లోని వస్తువులను శుభ్రపరుచుకుంటున్నారు. ఇప్పటికీ గ్యాస్ వాసనతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. రోజూ భయం గుప్పిట్లోనే బతకాల్సి వస్తుందంటున్నారు. పరిశ్రమను ఇక్కడ్నుంచి తరలిస్తేనే తమ బతుకులు బాగు పడతాయని చెబుతున్నారు.