భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో యువత గంజాయి మత్తులో చిత్తవుతోంది. నిర్మాణంలో ఉన్న భవనాలే వీరికి అడ్డాలుగా మారుతున్నాయి. ఏ పనిలేకుండా ఆవారాగా తిరుగుతూ.. గంజాయి మత్తులో గ్యాంగ్‌వార్‌లు జరుగుతున్నాయి. ఇలా.. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పది ఫిర్యాదులు నమోదయ్యాయి. కొత్తగూడెం రాజీవ్ పార్క్ వద్ద కొందరు గంజాయి మత్తులో బైక్ రైడింగ్‌లు నిర్వహించడం.. జనాలపై మద్యం బాటిల్స్ విసిరేయడం వంటి ఘటనలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయి.
రోడ్లపైనే బ్యాచ్‌ల వారీగా కుమ్ములాటలు జరుతుండటంతో... స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కొందరు ఆకతాయిలను అదుపులోకి తీసుకోగానే...ప్రజా ప్రతినిధుల నుంచి ఫోన్‌కాల్స్ రావడంతో వారిని విడిచిపెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత అర్ధరాత్రి గంజాయి బ్యాచ్‌లో ముగ్గురికి దేహశుద్ధి చేసి... పోలీసులకు అప్పగించారు స్థానికులు.