నిజమైన రైతు రాజ్యం వచ్చింది: హరీష్ రావు

Update: 2020-05-13 21:56 GMT

ఎంతో మంది త్యాగాల ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్‌రావు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నిజమైన రైతు రాజ్యం వచ్చిందన్నారు. కాల్వల భూసేకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో సిద్ధిపేట మండల రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేసిన మంత్రి హరీష్‌రావు.. త్వరలోనే స్థానిక రైతులకు మల్లన్నసాగర్‌ నీళ్లు తెస్తామని హామీ ఇచ్చారు.

Similar News