లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించేందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతంలోని పలు పరిశ్రమలో పనిచేస్తున్న వివిధ రాష్ట్రాల కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. వారి వివరాలు సేకరించి, వాటిని ఆన్ లైన్ లో జతపరుస్తున్నారు. వారిని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ కు తరలించి, రైలు ద్వారా వారి సొంతరాష్ట్రాలకు తరలించనున్నారు. తమను స్వస్థలాలకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేయడం సంతోషంగా ఉందంటున్నారు వలస కార్మికులు.