తెలంగాణను కరోనా వైరస్ కేసులు భయపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1454 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 33 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఏడుగురు వలస కూలీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 461 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. శుక్రవారం 13 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకూ 959 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో మొత్తం 34 మంది మృతి చెందారు. వరంగల్ రూరల్, వనపర్తి జిల్లాలో ఇప్పటివరకూ కూడా ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు.