తెలంగాణలో ఆర్టీసీ బస్సులు మంగళవారం నుంచి నడుస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. జిల్లాలకు చెందిన బస్సులు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సులకు, ఇతర రాష్ట్రాల బస్సులకు అనుమతిలేదని స్పష్టం చేశారు. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని కేసీఆర్ హెచ్చరించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు వందశాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చు అని తెలిపారు. పరిశ్రమలన్నింటికీ అనుమతి ఇస్తున్నట్లు పేర్కోన్నారు. హైదరాబాద్ నగరంలో సరిబేసి విధానంలో దుకాణాలు తెరుచుకుంటాయి అని తెలిపారు. సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లకు అనుమతి లేదని వివరించారు. అన్ని రకాల విద్యాసంస్థల బంద్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ సృష్టం చేశారు.