ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 57 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో ఒకరు, కర్నూలులో మరొకరు చనిపోయారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 69 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు అందులో వెల్లడించారు. గత 24 గంటల్లో 9వేల 739 మందికి పరీక్షలు నిర్వహించారు. ఓవరాల్‌గా చూస్తే ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2 వేల 339కి చేరాయి. 52 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.