ఉద్యోగులకు కేంద్రం షాక్.. లాక్‌డౌన్ సమయంలో జీతాల్లేవ్

Update: 2020-05-19 22:36 GMT

లాక్ డౌన్ సమయంలో పనిచేయని ఉద్యోగులకు జీతాన్ని చెల్లించడం కష్టమని.. అలాంటి వాటిపై చర్యలు తీసుకోవద్దని కేంద్రానికి.. సుప్రీం కోర్టు సూచించింది. లాక్ డౌన్ సమయంలో అన్ని వ్యాపార సంస్థలు ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని గతంలో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సుప్రీం కోర్టు తాజా తీర్పుతో కేంద్రం ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలు నష్టపోయామని.. దీంతో వేతనాలకు చెల్లించలేమని ఓ పరిశ్రమ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఉన్నత న్యాయంస్థానం తీర్పుతో కేంద్రం తన ఉత్తర్వులను వెనక్కుతీసుకుంది.

Similar News