కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చిరుత కలకలం సృష్టిస్తోంది. తిర్యాణి మండలంలోని ఖైరిగుడా, డిబిఎల్ ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో పులి సంచారం ఉన్నట్టు స్థానికులు గుర్తించారు.. విధులలకు వెళ్తున్న ఓసీపీ డ్రైవర్లకు పులి కనిపించడంతో వారు అధికారులు సమచారం ఇచ్చారు.. దీంతో పులి ఎటు నుంచి వస్తుందో తెలియక గ్రామస్తుల భయం భయంగా గడుపుతున్నారు. గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమైతో చాలా చోట్ల వణ్యప్రాణులు ఇలా జన సంచారాల్లోకి వచ్చి.. ప్రజలను భయపెడుతున్నాయి.